Responsive Advertisement

అకల్పిత గాథ


               అకల్పిత గాథ 

కొత్త చొక్కాపై ఎన్నో దారిమరకలు పడ్డాయి.
     అప్పుడు నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు మరక సహాజ గుణం కొత్త వాటిపై ప్రతికారం తీర్చడమే...అని
    అలానే నా పవిత్రమైన దేహంపై కూడ ఎన్నో మరకలు వచ్చి చేరాయి అప్పుడు మళ్ళి ప్రశ్నించుకున్నప్పుడు, నిజానికి శుభ్రతతో కూడినటువంటి దేనిమీద అయిన కూడ మరకలు ప్రతీకారం తీర్చుకుంటాయి. అలాంటి వారే ఈ మనుషులు ఎదుటి వారిపై వేసే అనవసర నిందలు 


     అదేవిధంగా సమాజంలో అవినీతి కొనసాగుతున్నంత కాలం అన్యాయం అక్రమాలకు ఎటువంటి కొదవ ఉండదు.

   కలం పట్టి కలగన్న ప్రతి జీవి ఈ సమాజపు దురహాంకారాన్ని నిందించే మార్గం లేక తాను కన్న కలలను తానే మర్చిపోతున్నాడు. ఒక సామేత ప్రకారం ఆట ఆడేవాళ్ళు ఎంత మంది ఉన్న ఆడిపించే వ్యక్తి ఒక్కరే అన్నట్టు 

        ఎంతో మంది ఎన్నో రంగాలలో రాణించాలని ఆశపడుతుంటారు అనేకులు రాత్రింపగలు కష్టపడతారు కానీ వారి శ్రమనంత వృధ చేయడానికి అధికారంలో ఉన్నటువంటి ఒక్క వ్వక్తి చాలు. జీవితం నాశనం సర్వనాశనం 
       కష్టే ఫలి మన పెద్దల మాట ఇదో పెద్ద సద్దన్న మూట .

నిజానికి నేను ఎవరి యొక్క వ్వక్తిగత రహస్యల గురించి ఇక్కడ ప్రస్తావించడంలేదు. వ్వక్తిగత రహస్యలు చర్చించడం అనేది మరో ఇతర ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ లేదా సంఘర్షణ ప్రారంభస్థానానికి మూలం అవుతుంది కనుక  ఈవిషయంలో జోక్యం, ఇతరుల భావోద్వేగాలను వ్యక్తపరచడం గురించి కానీ వాటిని కించపరచడం కాని నేను చేయడంలేదు.

       ఇలా కూడ ఉంటారు అని చప్పడానికి ఒక చిహ్నం మాత్రమే తెలుపుతున్నాను అయినప్పటికి ఈ విషయాలలో ఏ మాత్రం జోక్యం తీసుకోవడంలేదు 
      ఇక్కడ అనేక మంది జ్ఞానులు, అజ్ఞానులు, మరియు వారి వారి కర్మనుసారం మానవతీతులు మరియు కాలతీతులు కూడ ఇక్కడ మన మధ్యలో ఉండి ఉండవచ్చు.
       ఈ నాలుగు వర్ణల వారు కూడ కొందరు కాలాన్ని అదుపు పట్టగల వారి ఊహా సృష్టి నుండి సృష్టించబడిన వారు కావచ్చు.
        అనవసర ప్రసంగాల మధ్య సమయాన్ని వృధచేయడం ఇతరులు పలికే మాటలకు కట్టుబడి వుండటం ఇవన్ని తనని తాను కోల్పోయే చర్యలు 


   సొంత మార్గన్ని ఎంచుకోవడం ఎరుకతో జీవనాన్ని సాగించడం అతిముఖ్యం. వివిధ మార్గాలు అనుసరించి జీవించేవారు అనేకులు కనిపిస్తారు. వాస్తవానికి సొంత మార్గంలోను సొంత జ్ఞానంలో లీనమై ఉన్నవాడు ఈ సృష్టిని అనుసరించి లేదా ఉద్దేశించి ఎవరినైనా ఎగతాళి చేయగల సామర్థ్యం కలవాడు అగుతాడు 
            ఎగతాళి అనేది అప్పుడు ఆ క్షణంలో వారితో గడిపిన ఆనంద క్షణం మాత్రమే 



              జ్ఞాపకాలు  Clickhere  


Post a Comment

1 Comments