Responsive Advertisement

నా అనుభవం


                            నా అనుభవం 


నేను అంత పెద్ద గొప్ప ప్రేమికుడిని కాను 
సాధారణ "Stoic" జీవితాన్ని ఇష్టపడేవాడిని 
తన కోసం రాజ్యాలు గెలవలేదు.
 రాజులా రాజమందిరాన్ని నిర్మించలేదు.

తనకోసం కేవలం " పది పేజీల కవితా పుస్తకాన్ని" రచించాను . కొన్ని సంవత్సరాల నుండి నాలో ఉన్న తపన తను నాకు ఇష్టం అని తనకు చెప్పాను. 
ఆ క్షణం నాకు ఆనందం వేసింది కానీ అంతలోపు తాను ఇంకోకరి జీవితానికి సగ భాగం అయిందని దుఃఖించాను.కృష్ణుడికి రాధ దూరం అయినట్టు తను నాకు దూరమైంది.

 కాలాన్ని తిరిగి రాయలేను కానీ ఆమె అంగీకరిస్తే నా బ్రహ్మచర్య సామర్ధ్యంతో తనను మళ్ళీ పుట్టించి ఆమెతో ఆనందంగా గడపాలని ఉంది. ఆలోచనతో ఎరుకతో జీవితాన్ని అద్భుతంగా గడపగలను కానీ, ఇవన్నీ నా పుస్తక పేజీల్లోనే అందంగా ఉండిపోతాయి.

 ఇక ఈ జన్మలో ఆమెతో గడపటం అవకాశంలేదు ఆమె సహకరిస్తే ఆమె కోసం మరో జన్మను సృష్టించి ఆనందంగా గడుపుతాను.

జీవితం అందమైనది మరియు విచిత్రమైనది 
అందరి భావాన్ని ముందుగానే అర్ధంచేసుకొనే ప్రకృతి 
నా కలల్నీ నా కలల సామ్రాజ్యాన్ని ఏ మాత్రం కూడ పట్టించుకోలేదని నాకు కొంచం బాధ కొంచం కోపం ఉండేది 

కృష్ణుడి రాతలో రాధ లేకపోయిన రాధ మనసులో కృష్ణుడు శాశ్వతంగా ఉన్నట్లు నా జీవితంలో తను లేకపోయిన తన ఆలోచనలో తన మనసులో తన జ్ఞాపకాల్లో నేను ఒక కృష్ణుడిలా తన జీవితపు చివరి ప్రయాణం వరకు ఉంటాను 

    రెండు స్వచ్ఛమైన మనసులను ఏది కూడ ఆపదు 
తనకు నేను ఇష్టం నాకు తను ఇష్టం అని మాకు తెలుసు
బయట ప్రపంచానికి ఇద్దరం దూరం.
జన్మలు ఉంటాయని తెలీయదు 

కానీ జన్మంటు ఉంటే తను నా కోసం మళ్ళీ పుడత అని చెప్పిన తన మాటకి నేను ఆమెకు దాసుడిని అయ్యాను 
      తనువులు కలవని జీవితాలుగా మారి.....
మనసులు కలిసిన ఆత్మగా ఏకమై.....
   మరో జన్మకు తపించే మా ఇద్దరి బంధం
ఈ పుడమికి సాక్షం......... అవుతూ
మళ్ళీ జీవం పొంది కాలంతో మా బంధం సాగాలనేది నా చిన్న....... ఆశ 

చలి అందాలు చల్ల చదురుగా కనిపించినప్పుడు 
మది ఆశలు కాస్త మత్తేకించినప్పుడు శరీర వాంఛే అని 
తెలియనప్పుడు 
క్రొవ్వొత్తులు కాస్త కాగడాలుగా వేలిగినప్పుడు 
చలి అందంపై ఎక్కే కామ, మోహలకు పునీతుడై 
చలి శృంగార సంద్రంలో మునిగేందుకు చేసే ప్రయత్నమే ప్రేమ నేను ఇలాంటి ప్రేమను ఎప్పుడు కోరుకోలేదు 
నేను మనుసు ఎంతగానో దగ్గరయ్యాను శరీర సుఖాల పట్ల దూరంగానే ఉన్నాను 

మనసు ఎప్పుడు స్థిరంగా ఒక చోట ఉండదు 
మాట ఎప్పుడు మౌనంతో ఉపయోగకరంగా ఉండదు 
జీవితం ఎప్పుడు మనం అనుకున్న విధంగా ఉండదు 
కానీ మనిషి మాత్రం ఒంటరిగ ఉన్నాడు 
గడిచిన ప్రతిక్షణం ఒక అనుభవం సాగే ప్రతి ప్రయాణం ఒక కొత్త పరిచయం అంతా తెలుసుకోవడమే తప్ప తప్పేది ఉండదు కానీ ఒకడిలా అన్నాడు మనిషి పుట్టుక ఒక నీచం గిట్టడం ఒక నీచం 

ప్రేమ శాశ్వతం కాదు నేను ప్రేమకు వ్యతిరేకిని కాను 
స్త్రీజాతి అంతా పవిత్రమైనదని చెప్పలేను అలా అని వారిని కించపరచలేను పురుష జాతిని పొగడలేను అలా అని వారిని గొప్పవారని అనలేను 
నేను ప్రేమకు బానిసకాను స్త్రీ శరీర అందానికి ఆకర్షితుడ్నికాను జీవితం సజావుగా నడుస్తుంది 

 ప్రేమ 

ఒక వ్వక్తి ఇష్టపడిన స్త్రీ
ఆ స్త్రీ ఇష్టనుసారంగా ఆ వ్యక్తి
ఆ స్త్రీ నుండి ఆ వ్వక్తి పొందే శారీరక సుఖమే ........
ఇది ఇష్టంతో చేసుకోనే కోరికలు మాత్రమే 
ఇందులో ఎటువంటి బలవంతపు చేష్టలు ఉండవు.

నా చూపులు తన చూపులను చూడటానికి తడబడిన 
నా గది తలుపులు నా మది తలుపులు మాత్రం తన పాద స్పర్శ కోసం పరితపించిపోతుంది.........









Post a Comment

0 Comments