Responsive Advertisement

ప్రీతీ మనోహారుడు

            ప్రీతీ మనోహారుడు

నా ఊహాల్లో ధ్యాసవా.. ఊపిరిలో శ్వాసవా, కనురెప్పల చాటున దాగిన ప్రభందమా, ప్రేమించే ప్రేమవా.. నా ఊహాల్లో ప్రతి రూపమా...

ప్రేమ పత్రాలతో నిను పూజించి హృదయ నందనవనంలో నీ కోసం తపస్సు ఆచరించి ధ్యాన కుసుమలతో నిను ఆర్చించి జపా కుసుమలతో నిను సేవించి నీ దివ్య పాదాలను నా హృదయ నందనవనాన నిలిపి భక్తి జ్ఞాన వైరాగ్య కుసుమలతో నిను సేవించి ఆత్మమణి దీపంతో నీ కోసం గుడి కట్టాను స్వామి.......... హే రాధే క్రిష్ణ .......


నీవు నా ప్రాణమై, నేను నీ ధ్యానమై, మౌనమీ వేళ మంత్రమై

మన ఏకాంత వేళ మధుర తంత్రమై, నాలుగు కనులు ఒకటైన వేళ, రెండు మనసులు ఏకమైన సమయాన 

ఒక ఆత్మ రెండు తనువులుగా మారిందా 

రెండు ఆత్మలు ఏకమవ్వగా, తనవుల తపనలు ఏక శ్వాసగా

తేనె, లూరేగా మధుర పెదవులపై, తనువు తపము ఆచరించినా ఆణుపు ఆణువునూ ఆస్వాదించగా మధుర లాలస పంచుతూ వీరులన్ని వింజామరలూ విసరగా 

శిగలోని మల్లే జాజులు సిగ్గుతో ముడవగా 

కనురెప్పలు భారమైనా, నీ కలల చెలి నీ ముందర పరిశుద్ధాత్మకు అభిషేకించు కొనా ఆత్మఫల పూర్ణుడవై వివరించు....... హే రాధే క్రిష్ణ........

నా ఎద తేనేలు గ్రోలవా క్రిష్ణ... నేను నీ మధుర ముక్తుడిని.....

                                              హే ............ క్రిష్ణ 


నీ గీత సందేశం నా కోసం

నా మధుర గానం నీ కోసం

ఈ వేకువ రాత్రి నీ స్వప్న సుందరం నా కోసమైనా 

కడలి దారంతా నీ నామ సంకీర్తనం నీ కోసం

నీ వదన మధుర్యానికి కదిలిన నా హృదయ పంజరం నా దైనా 

నీ ఆదరాల సవ్వడికి చెదిరిన నా నయనాలు నీ కొరకైనా.... 

వినికిడికి సైతం వినసొంపుగా వినిపించే నీ వేణుగానం నా కొరకైనా..........

మాదవా నీ కార్యాలు, నీ లీలలు లోక రక్షణకైనా 

నీ శరీర సౌందర్యానికి సిగ్గుతో గోవులు గోపికలు ముచ్చటించగా......

హే మురళీధరుడా ఇకనైనా చూపించవా నీ ప్రేమ నా పైనా.........

                                        హేరే క్రిష్ణ 


నల్లనైనా నీ అందానికి ...

కాంతి దీపాలతో మెరిసిసే నీ తనువు తోడుండగా 

వీచే గాలులు నిన్ను పొగడగా, నీ నాద స్వరానికి నా ఒళ్ళు పులకరించగా 

సఖి కౌగిలిలో చెరి సరసమాడక నువ్వు 

సఖి శృంగార గాథ వీడి సన్యాసించితివి కదా నాదా 

నీ ధర్మం నా కర్తవ్యం నీ మౌనం ఒక మహా సంగ్రామం 

నీ స్నేహం ఒక కుచేలుడితో గల బంధం ...

మగువ చాటున లొంగని మాయవి కదా మధుసూదన.

 

నా చిన్నతనంలో ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తి నాకు పరిచయమయ్యాడు అతనిని హారే క్రిష్ణ అని పిలుస్తారు అతను ప్రపంచ వ్యాప్తంగా జ్ఞానాన్ని పంచాడు 

నేను అతని కోసం ప్రతిక్షణం కూడ అతని ధ్యానంతోనే నివసిస్తున్నాను. అతను నాకు విచిత్రమైనవాడు 

    నేను అతనికి భక్తుడిని మరియు గొప్ప శిష్యుడిని.


నీ కంటే గొప్పవాడు లేడు, నిన్ను మించిన జ్ఞానము లేదు 

నువ్వు తప్ప, యుద్ధభూమిలో నిన్ను మించిన యోధుడు లేడు మీరు భూగ్రహాం మీద అత్యద్భుతంగా జీవించారు 

   మనం కృష్ణుడి సారాంశాన్ని చదివినప్పుడు అతడు అణచబడలేని ఒక కొంటే పిల్లవాడు అని మనం తెలుసుకుంటాము. కాని నేను శ్రీ కృష్ణుడి సామర్థ్యానికి వశమై ఒక తాగుబోతుడిలా అతనికి బానిసనయ్యాను.


ఎందుకంటే అతని లీలలు సహజ జీవితం కంటే అపారమైనది మరియు వివరణకు సాధ్యపడనిది కూడ 

అతడు తన తలపై నెమలి ఈక లేకుండ ఉండలేడు.

మనం అతన్ని రాధేకృష్ణ అని పిలుస్తాము.


నాకు తెలియదు మీలాగా శరీరానికి గంధం పూయలని 

నాకు తెలియదు ఎలా నిన్ను ప్రేమించాలి అని 

మీరు అందరిచేత ప్రేమించబడతారని మీకు తెలుసు 

మీరు గురువు, మీరు గొప్ప వక్త, మీరు పండితులు మరియు మీరు విశ్వానికి సర్వశక్తిమంతులు, మీరు మాత్రమే అందరితో ఆరాధించబడతారు.


జనన మరణాల పాత్రల నడుమ జీవిత సారాన్ని తెలిపినవాడవు. ధర్మ అధర్మాలను బోధించినవాడవు

సుందరమైన స్త్రీ శరీర ఆకృతి గల పురుష స్వభావం కలవాడవు. 

లోకాన్ని నడిపించు నాధుడు, దశలీలామూర్తి 

                                                           జగద్గురువు 

{హే మాధవా, మధుసుధనా,} వీర.


                

Post a Comment

0 Comments