Responsive Advertisement

అంతర్ ధ్యాన మందిరం (The love theory part 1)


                పరిచయం

      అందరిలాగే యధావిధిగా ఆడుతూ పాడుతూ ఆనందంతో కొనసాగుతున్న నా సాధారణ జీవితం ప్రపంచానికి కూడ కనిపించని విధంగా సాగుతూ ఉండేది.


కలలో కూడ ఊహించని వ్యక్తుల పరిచయం వారితో నాకు కలిగిన ఆనందం అనుభవిస్తున్న అనుభూతి నా  అంతరంగిక ఊహ సంఘటనలు వీటి ప్రభావం చేత నాకు నా కథ రాయడానికి ఒక ప్రేరణ కలిగింది.    

                     ఈ పదాలు నాకు కలిగిన ఆనందం నుండి పుట్టుకొచ్చాయి.

    ప్రేమలో జీవించడం అది ఒక అద్భుతం, కానీ ప్రేమ మనకు వ్యతిరేకమైనప్పుడు మనకు కలిగే బాధలు వాటి ద్వారా కలిగే ఇబ్బందులు మార్పులు మొదలగు విషయాలు.


      ప్రారంభం:-     నేను 

నాలో ఏదో తెలియని అనుభూతి ఆమె ముఖ తెజస్సు వైపు నా దృష్టి మళ్ళెల చేసింది. నా మనసు గత దేహ, భావ స్థితులను మరచి ఆమె తేజస్సులో మునిగిపోయి తరించేలా చేసింది.


       చంద్రచూడమనికీ సైతం రాని ఆ కాంతి ఆమెది ఆ రంగులమయంతో నిండినది ఆమె సౌందర్యం పదే పదే ఆమె ఆలోచనలో చేరి ధ్యాన స్థితిలో నిమగ్నమైంది నా అంతరాత్మ.


    ఆశల నిరాశల హద్దులను దాటుకుంటు చేజిక్కించుకోవాలని అరాటపడుతుంది నా బుద్ధి గుణం అందనంత దూరానవున్నా అందుకునేలా చేసేది చరవాణి (mobile phone) బాహ్య ధ్యాన ఆలోచన కన్న అంతర్ ధ్యాన ఆలోచనలే జీవితానికి అతీతమైనది.

   మిగతా భాగం part 2 లో తెలుసుకుంద్దాం.

                    మనోహర్ భట్టు.


Part 2 కొరకు clickhere 

       

Mother's love   click here 


 

Post a Comment

0 Comments