భూస్వర్గములు
శ్రామికులు యధావిధిగా రోజు వారి పనులు ముగించుకుంటు ఇంటికి వస్తున్నారు. వ్యాపారులందరు తమ షాపులను ముసేసి రాత్రికి బయలుదేరుతున్నారు. పట్టణాలన్ని గందరగోళమై ఉన్నాయి. పల్లెబాటలన్ని ప్రశాంతంగా ఉన్నాయి.
రోజు వారి జరిగే కార్యకలాపాలు ఇవన్ని ఒక క్రమపద్ధతిలో నిరంతరం కొనసాగుతున్నాయి. ఈ జీవనంతో పాటు మరికొంతమంది నిత్యము యవ్యనస్తుడి నుండి ముసలివారి వరకు తాగుడు, తిరుగుడు, జూదం వంటి మొదలగు అలవాటుకు వ్యసనమై జీవిస్తున్నారు.
వీటితో ఈ మత్తుతో పాటు వారిని ప్రధానమైన మూడు భూస్వర్గములు కూడ ఆకర్షించింది. ప్రతి వ్యక్తి స్వర్గాన్ని చేరుకోవడానికి భూలోక స్వర్గాలలో ఏదో ఒక మార్గాన్ని అనుసరించక తప్పదు.
భూలోక స్వర్గములు : 1. భగవంతునిగ యందు భక్తి . 2. స్త్రీ, పురుషుల మధ్య కలిగే ప్రేమ 3. వేశ్య వాటిక నందు కామ కోరికలు.
ఈ మూడు స్వర్గములలో ఏదో ఒక మార్గాన్ని అనుసరించి జీవించే వారికి ఎక్కడ దొరకని ఆనందాన్ని వీటి ద్వారా పొందుతారు. ప్రతి మార్గంలో జీవించే వారికి ఆ మార్గం అతి పవిత్రమైనది. ఈ మార్గాలను కనిపెట్టినది మానవుడు.........
మనిషి జీవనశైలి
ప్రకృతి భూమిపై వివిధ జీవులను సృష్టించింది అవన్ని యోని స్వరూపాలు దాని నుండి ఉద్భవించిన చరచర జీవులలో ఒకే ఒక తెలివైన జీవి (మానవ జాతి) ఈ మానవ జాతి పుట్టుకతో అనేక అనర్థాకు దారితీసే సమస్యలు పద్ధతులు పుట్టుకొచ్చాయి. ఈ మానవ జాతి మతాలు, సంస్కృతి, సంప్రదాయాలు, మూఢ నమ్మకాలు అంటు అనేక సిద్ధాంతాల ఉద్భవనకు కారణమైంది.
మూఢ నమ్మకాలను ముడిపెట్టి ప్రజలు మోసానికి పాల్పడుతున్నారు. కానీ వారు విశ్వాసమునకు వ్యతిరేకులై మోసానికే (మూఢ నమ్మకానికి) ప్రాముఖ్యతనిచ్చారు. అయితే ఈ సృష్టికి కారణమైన ప్రకృతి రూపాన్ని ఈ జాతి మరిచిపోతుంది.
వ్యక్తి యొక్క వ్యతిరేక భావన :
ప్రేమ లేదు. ఇది మనోహరమైన జీవితం కాదు. జీవించే నేను మీతి మీరిన వ్యక్తులను చూస్తున్నాను. వారితో జీవించడం, వారి స్నేహనుబంధం నన్ను వాళ్ళనుంచి దూరంగా ఉండేలా చేస్తుంది. వాళ్లను ఎప్పుడు చూసిన నాకు అసహ్యం కలిగేది. కాని నేను ఏమి చేయలేని పరిస్థితి సమాజ మార్పును ఎదుర్కోవడాన్ని నన్ను నా సభ్యులు అడ్డుకుంటున్నారు.
సమాజం రోజు రోజుకు నశించిపోతున్నది. సమాజం నశించిపోవుటకు ప్రధాన కారకులు మానవులు. మానవ ఆలోచనల ఫలితంగా సమాజ అభివృద్ధి నేటికి కొనసాగుతుంది. కాని అభివృద్ధి కారణంగా పర్యావరణం క్షీణింపబడుతుంది.
Anthar Dhyan mandir ClickhereClickhere
0 Comments