Responsive Advertisement

జ్ఞాపకాలు

 


                                                                             జ్ఞాపకాలు

సాయంకాల సమయంలో అనుకొని సంఘటనలు నా జీవితంతో ముడిపడివున్న గత అనుభవాలు ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చింది. స్నేహితులకు ఎదుటి వ్యక్తులకు పంచుకోలేక నాతో శాశ్వతంగా ఉండిపోతున్నాయి. నాకు విపరీతమైన కోపం సంతోషం బాధ వేసేది. వీటి కారణంగా నేను నిశ్చలస్థతిలోకి జారుకుంటున్నాను.

      ఎండలు పెరిగే వేళలో కాలినడకన నడిచేటప్పుడు వచ్చే ఆలోచనలకు ముగింపు దొరకనే దొరకదు.
       తెల్లవారుజామున మేఘచ్ఛాయలు మారిపోయాయి. అతి చల్లటి గాలుల మధ్య జీవక్రియను ప్రారంభించాను. అనుభవాలతో సంబంధం ఉన్నవారు నన్ను దూరం చేస్తున్నారు. నేను అవహేళనకు గురవుతున్నాను. కాలల మార్పులకు అనుగుణంగా వ్యక్తిత్వ మనసులు మారుతున్నాయి.వీటి ప్రభావం చేత సమస్తమును చదువుటకు సిద్ధం అవుతున్నాను.

ఒకరి ఆయూష్యు 90 సం॥ రాలు మరొకరి ఆయూష్యు 100 సం॥ రాలు ఇంకొకరిది 80 సం॥ రాలు అలా ఏదో ఒక రోజున శరీరం పడిపోవాల్సిందే 

   ఇక్కడ జీవితం శాశ్వతం కాదు 
ఇతర జీవితాలు శాశ్వతం కావు 
  ఆలోచనలు, జ్ఞాపకాలు శాశ్వతం కావు
ప్రేమలు, గత పరిచయాలు శాశ్వతం కావు
బందాలు, బంధుత్వాలు శాశ్వతం కావు 

   దయ, జాలి, కరుణలు శాశ్వతం కావు
చీకటి, వెలుతురులు శాశ్వతం కావు
నువ్వు శాశ్వతం కాదు నేను శాశ్వతం కాదు

    అలా నీ తల్లిదండ్రులు శాశ్వతం కాదు 
ఒకరి కడుపున పుట్టిన ఒక్కడివే పోతావు ........

        అన్నదే శాశ్వతం.
                                                మహార్ భట్టు.


                        సంఘర్షణ click here click here
 


Post a Comment

0 Comments