ఆధ్యాయం 4
ఉప్పోంగిపోయే సాగరమునకు ఎదురు అడుగులు వేయలేని జాలరిలా.......
అప్పుడే పడిన నీ ప్రేమ మత్తులో పసివాడినై అడుగులు తెలుసుకుంటున్నాను.
అందమైన దృశ్యాలు, అందుకోలేని తారా కిరణాలు నన్ను తనివితీర నీతో గడిపెందుకు ఏకాంతాన్ని ప్రసాదించాయి.
భయము బాధతో కలిగిన ఏకాంతం ఒంటరితనాన్ని అందిస్తే నీ ద్వార పొందిన ఏకాంతం నన్ను నాతో పరిచయం చేసింది.
నేను రాసే ఈ రాతలు నీ ఉద్దేశ్యంలోనివని నీ మనస్సాక్షికి తెలిసే ఉండవచ్చు. నేను నిన్ను ఎప్పటికి విడవనని నీకు తెలుసు, నేను నమ్మతున్నాను.
నువ్వు నన్ను అంతలా ఆకర్షించేశావు.
ప్రతి ఏటా పండుగలతో రానీ నాలో కొత్తధనం.... ఈ ఏటా నాలో కొత్తధనాన్ని నూతనంగా ఆవిష్కరించావు.
నా జన్మంత తపస్సు చేసిన దొరకని వరంలా దొరికేశావు. జీవిత వృధాకు కారణాలు ఎన్ని ఉన్న వాటి యెక్క ఫలితమే జీవనశైలి.
ఈ రోజు నా కథనంలా కనిపించిన మరోక దృశ్యం నా కనుల ముందు కనివిందు అయింది. అతడు ప్రతి మాటలతో ముసి ముసి నవ్వులు నవ్వుతూ మురిసిపోతున్నాడు.
అనేక పరిస్థితులను అడ్డుగా నిలిపి గుండె బరువును నా కంటతడితో దింపుకుంటున్నాను.
హాయి, దుఃఖం అనే రెండు వేరు వేరు కలయికతో నిత్యం కలిసివుంటున్నాను. కామలతో కొనసాగుతున్న నా మనోవేదనను మా ఇద్దరి మధ్య విడవరిచాను.
చిరునవ్వును నీకై తాకట్టు పెట్టి నీ చీర కొంగున తల దాచుకుంటు చిరకాలం జీవిస్తాను. చలి.... మనం సందర్శించిన వ్యక్తుల పలకరింపులు వారు చూపే ప్రేమ మమకారం అవన్ని తాత్కాలికమైనవి.
అయిష్టంతో కాలాన్ని గడుపుతూ జీవనాన్ని కొనసాగించే వారు ఈ లోకంలో చాల మంది ఉన్నారని పరిస్థితుల వల్ల నాకు అర్ధమైంది.
ఎటువంటి వ్యక్తులపై ప్రేమ మక్కువ లేదు. నేను రాత్రి, పగటితో నా స్నేహబంధాన్ని కొనసాగించడం మొదలుపెట్టాను.
అందరికంటే అన్నీటికంటే ఈ రెండు శాశ్వతమైనదని నాకు అనిపించింది.
ప్రేమ మయలో పడి బయట వారిని మరచిన నాకు మా ప్రేమ తోడులో వుండే నీడలా కూడ అనిపించింది.
చాటింగ్ తోనే ఆనందం కలుగుతున్న నాకు మా ఇరువురి మధ్య కొన్ని గంటలు కొన్ని నిమిషాలు ఎలాంటి పలకరింపులు కొనసాగలేదు. దాంతో నేను చలించిపోయాను. పలుమార్లు ఆమెను ఫోన్ లో నేను పలకరించాను.
కానీ నా పలకరింపులకు సమాధానం లేదు. నాకు ఏం చేయాలన్న ఆలోచన కూడ లేకపోయింది. హఠాత్తుగా ఒక్క సమాధానం వచ్చింది. దాంతో నాలో కొత్త ఆశలు మళ్ళి చిగురించాయి.
నేను ఎన్ని సార్లు నా మది భావాలు వ్యక్తపరచిన తను నన్ను స్నేహభావంతోనే చూసేది. పలుమార్లు నా భావాలు వ్యక్తపరుస్తూనే ఉన్నాను. తన చిరునవ్వు సమాధానం మాత్రం ఆదే అని నా ఊహ.
కానీ నేను ఆమెతో శాశ్వత ప్రేమకై సిద్ధపడుతున్నాను. ఆ చేతన వస్తువుల వలే నేను నిశ్చలస్థతిలో ఉండిపోతున్నాను.
బయట జీవితానికి ఆమె నాకు శారీరకంగా దూరంగా ఉన్న నా అంతర్ ప్రపంచ లోకంలో మానసికంగా తను నాకు నా శరీరంలోని సగ భాగమే. ఎప్పటికి కూడ సగ భాగమే.
అందమైన ఆలోచనలు అద్భుతమైన జ్ఞాపకాలు జీవితం ఉన్నంతకాలం మనతోనే మనలోనే ఉంటాయి.
ప్రతి విజయవంతమైన నేరస్థుడి వెనుక ఒక మహిళ లేక ఒక అమ్మాయి ఉండవచ్చు.
THE END
PART 3 కొరకు click here
Mother's love click here
0 Comments