ఆధ్యాయం 3
కాలంతో నాకు జ్ఞానోదయమైంది నేను నా దివ్యదృష్టితో ఒక ఊహాలోకాన్ని సృష్టించి ఆమెతో హాయిగా కాలం గడుపుతున్నాను.
కాని నా ఊహా సంఘటనలు బాహ్య ప్రపంచమునకు అవాస్తమైనదని తెలిసినప్పుడల్లా నేను ఆవేశపూరితమైన చర్యలకు పాల్పడుతున్నాను.
కాలం సాగుతున్న కొద్ది నా ప్రేమ పుస్తకంలోని కాగితాలు అదృశ్యమవుతున్నాయి
అవి నన్ను ఆందోళబరితుడ్ని చేస్తున్నాయి.
అయినను రేపటి దినం ఊహాకందనిది.ఆమెను
తిరిగి అందుకుంటానన్న విశ్వాసం నన్ను ఇప్పటికీ మీ ముందు బతికివుండేల చేస్తుంది.
పరుగులు తీస్తున్న క్షణాన్ని పట్టుకుంటు
పరిగెడుతున్నాను. నీ సమాధానం కోసం వేచి
చూస్తున్న నా అంతర్ ధ్యాన మందిరం.
తొలి పరిచయంతోనే కొత్త మలుపుకు
దారితీసిన నా జీవిత కథకు మరోసారి తన ఊహాగానాలతో నన్ను ఆనందబరితుడ్ని చేసింది.
అనుకోకుండా నాలో ఈ చింతన కలిగింది ఇద్దరి వ్యక్తుల మనసు కలిసి జీవించడానికి ఎలాంటి తాళిబంధం అక్కర్లేదు కదా.....అని
పవిత్రమైన మన ప్రేమబంధం ముందు
సమస్తభువనములు మేళతాళలు, సన్నాయివాయిద్యాల ధ్వనులే కదా.......అని
నాకు అనిపించింది.
ఇలాంటి వాటిని చట్టాలు ఉల్లంఘించిన
ఇద్దరి మనసులు కలిసిన ముందు ఈ చట్టాలు
నామ మాత్రమే కదా.....అని నా అంతరంగిక
ఆలోచన.
వర్షాధరలన్ని కలిసి నది ప్రవాహంలో చేరేలా...
నీ చూపులగారడిలన్ని నా వైపు చెరలేవా ఓ సారి............
నీ మధురాతి మధురమైన జ్ఞాపకాల
పోగులో పడి రాత్రాంత పగటికలు కంటుంది.
నా మది.
చీకటికి పరిమితమైన నన్ను నీ చెరువలోకి
లాగి చివరి వరకు తోడులేని నీడలా నీ ఒడిలో
దాగుండిపోయాను.
ఒక వైపు నీ ధ్యాస మరోవైపు నా శ్వాస
నిన్ను విడిచి ఉండలేకపోతున్నాయి.
యుగ యుగాంతం కూడ మరవని ఒక (పారు దేవదాసు) ఒక ( లైలా మజూను) కథనంలా ఈ యుగం చివరి వరకు కూడ మన ప్రేమ చిరకాలం సాగుతుంది. ప్రేమ పక్షుల్ లాగా
గడిచిపోయిన జ్ఞాపకాలను ఎదురోచ్చే రోజులతో ముచ్చటలాడుతూ మురిసిపోతున్నాను.
నా తుది వరకు అయిన నీ మయలోనే అంతర్లినమై నా జీవాన్ని కొనసాగిస్తాను.
నీ తోనే.........
Part 2 కొరకు click here
Part 4 కొరకు click here
Mother's love click here
0 Comments