Responsive Advertisement

అంతర్ ధ్యాన మందిరం (love theory part 2)

                   ఆధ్యాయం 2 

     ఈ పదాలు ఊహబరితమైనవి కావు వాస్తవానికి సత్యానికి సమాన కారకాలు.

         విస్తృతమైన ఈ బాహ్య ప్రపంచము నందలి చిటికెడేంతయినా కూడ సరితూగని మా ఇద్దరి తీయని ఆ మధుర క్షణాలు ఈ విశ్వగర్భంలో ఎన్నో దాగివున్నాయి. ఆమె కనుచూపు కదలికలకు నా హృదయ స్పందన నృత్యకేళితో పరవశించిపోయేది.

      ఆమె రాకకై ఎదురుచూస్తున్న నా యవ్యనం నిత్యము కాలముతో దహించబడేది. సముద్రగర్భమున దాగని రహస్యముతో మా ఇద్దరి మధ్య దాగివున్నా రహస్యము బాహ్యమునకు నిగూఢమైనది.

         మూడు మూళ్లతో ఏడు అడుగులతో తను నా జీవితానికి సొంతం అయిన కాకపోయిన, ఎప్పటికి ఊహించరానిది ఎన్నటికి మరవనిది నీ నా పరిచయం నా జ్ఞాపకాలన్ని మయిమరపించిపోయేలా చేసే నీ రూపం (చిత్రమాళిక) నా జీవితాంతం నా ఈ అంతర్ ధ్యాన మందిరంలో నిరంతరం పూజనీయమైనది.

       కనుల ముందు కనిపించే అద్భుతాలు ఎన్ని జరిగిన కూడ అవి మన నిజ జీవితంలోకి
చేరుకోవని నాకు విధి ద్వార లిఖితమైంది.

          కాలముతో ముడి పెట్టుకొని ప్రయాణిస్తున్న నా జీవితాన్ని ఒక్కసారిగా అది
నన్ను క్రుంగదిసింది. ప్రతిక్షణం నా మది సమాధానం లేని ప్రశ్న అనే లోయలో
 పడుతు లేస్తుంది.

        అంతులేని సంభాషణలు మా ఇద్దరి మధ్య ఎన్ని ఉన్నప్పటికి ఈ విధి నన్ను చివరిలో నిమిత్త మాత్రుడిని చేస్తుందేమో అన్న భయ భ్రాంతులలో నా జీవితం పయనిస్తుండేది.

    దిక్కులన్ని తెలిసిన కూడ దారులు కనిపించని ఒక గ్రుడ్డి వాడినై నా ఈ అంతర్ ధ్యాన మందిరంలో ఆమె కొరకు వేచి                                చూస్తున్నాను.
      మంత్రముగ్ధుడిలా కట్టి పడేసే తన మాటల 
     పలుకులు నన్ను తన్మయత్వంలో
 జారిపోయేలా చేసేవి. 
       నాపై తన భావాలు వ్యక్తపరచడంలో మౌనాన్ని ప్రదర్శించడంతో ఆమెపై నాకు కలిగే అభిప్రాయాన్ని తెలపడంలో నేను వెనకడుగు దాల్చుతున్నాను.

      ఒక్కసారిగా నా జీవితంతో ముడిపడివున్న గత సంఘటనలు నా ఎదుట వచ్చి నిలిచాయి.
మౌనం నన్ను మరోసారి నిరాకరణకు గురి చేస్తుందేమో అన్న భయానికి లోనైయేలా చేసింది.  

   కనుక అభిప్రాయాలను తెలిపేంతవరకు నా భావా వ్యక్తికరణను మరచి ప్రేమను కనపరచుచు ప్రపంచ ప్రేమికుడిలా జీవిస్తాను.

మిగతా భాగం part 3 లో తెలుసుకుంద్దాం.

   Part 1 కొరకు click here 


   Part 3 కొరకు  click here 


Mother's love   click here 



         
      
    

                          

Post a Comment

0 Comments